బన్నీతో శ్రుతిహాసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, డైరెక్టర్ హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘సరైనోడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చాలా ఆలోచించి బన్నీ తన క్రేజ్‌ను మరింత పెంచే సినిమాతో రావాలని దర్శకుడు హరీష్ శంకర్ పేరును తెరపైకి తెచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆమెను సంప్రదించారని సమాచారం. ఇక గతంలో సూపర్‌హిట్ ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన శ్రుతి మళ్లీ ఈ సినిమాతో ఆయనతో జత కట్టనుండడం విశేషంగా చెప్పుకోవాలి. కెరీర్‌లో అల్లు అర్జున్ ఎప్పుడూ ఒకే హీరోయిన్‌తో రెండు సినిమాలు ఇంతవరకూ చేయలేదు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్టు నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.