సిద్ధమవుతున్న జో అచ్యుతానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా కాలానికి ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా వస్తున్న ఈ సినిమా శ్రీనివాస్ మార్క్ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని సమాచారం. ఇక కొద్దినెలలక్రితం ఆర్భాటాలేవీ లేకుండా సెట్స్‌పైకెళ్ళిన సినిమా దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జ్యోత్స్న అనే ప్రధాన పాత్రలో రెజీనా నటిస్తున్నారు. కళ్యాణ్ కోడూరి అందించిన ఆడియో త్వరలోనే విడుదల కానుంది.