8న రానున్న మేము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య, ఆమలాపాల్, బిందుమాధవి ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా రూపొందించిన చిత్రం ‘పసంగ-2’. ఈ చిత్రాన్ని తెలుగులో జూలకంటి మధుసూదన్ రెడ్డి సాయి మణికంఠా క్రియేషన్స్ పతాకంపై ‘మేము’గా అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రం ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- పిల్లలతోపాటు పెద్దలు కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇదని, సూర్య ఈ సినిమాను తమిళంలో రూపొందించారు అంటే, ఈ కథ గొప్పతనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో మంచి సందేశం కూడా వుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:అర్రోల్ కొర్రెల్లి, కెమెరా:బాలసుబ్రమణియన్, మాటలు, పాటలు:శశాంక్ వెనె్నలకంటి, సమర్పణ:సూర్య, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత:జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండీరాజ్.