త్వరలో 21 సెంచరీ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బిఆర్‌ఎస్‌ఐ పతాకంపై పోల్కంపల్లి నరేందర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ఆర్‌కె స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం వినోదాన్ని పండిస్తూ సందేశాన్ని అందించే విధంగా వుంటుందని, ప్రేక్షకులకు ఆలోచనాత్మక ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించామని అన్నారు. ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్ ప్రేమికులనే కాకుండా సినిమా ప్రేమికులను కూడా ఆకట్టుకుంటుందని, పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయని ఆయన అన్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల పృధ్వీ, నల్లవేణు, సుమన్‌శెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:కనిష్క, దర్శకత్వం:పోల్కంపల్లి నరేందర్.