పేదల పెన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి హన్సిక ఇటీవల తన చేతికి ఎముక లేదని నిరూపిస్తోంది. దానాలమీద దానాలు చేస్తుండడం కోలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది. ఇటీవలే తన దాతృత్వాన్ని మరో సంఘటనతో నిరూపించుకుంది. చెన్నై మహానగరంలో వున్న ఇళ్లు లేనివారికి సామాజిక స్పృహతో తన వంతు సాయం చేస్తోంది. రాత్రి సమయాల్లో ఇళ్లు లేక రోడ్లమీద నిద్రపోతున్నవారు, చలికాలంలో ఇబ్బందులు పడుతున్నవారు, వర్షాల కారణంగా రోడ్లపై బాధపడుతున్నవారికోసం తన నగదును వెచ్చించి మరీ దుప్పట్లు, తినడానికి ఆహారం, మంచినీరు అందిస్తోంది హన్సిక. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ ‘ఇది రుతుపవనాల కాలం. దయచేసి మీరు కూడా మీ వంతు సాయం చేయండి’ అంటూ సందేశం ఇచ్చింది. హన్సిక చేసిన ఈ మంచి పనికి పలువురు సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు.