దెయ్యం ఉంటే భయమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ హీరో అల్లరి నరేష్, కామెడీ దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి కలయికలో గతంలో వచ్చిన ‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’ చిత్రాల స్థాయిలో రూపొందుతున్న మరో చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర పతాకంపై రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుంతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, దర్శకుడు కథ చెప్పగానే బాగా నచ్చడంతో సెట్స్‌పైకి వెళ్ళామని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ చిత్రంలో అక్కడక్కడా హారర్ టచ్ వుంటుందని, అది అందరినీ నవ్వించేలా రూపొందుతుందని తెలిపారు. గతంలో అల్లరి నరేష్, తాను కలిసి రూపొందించిన రెండు చిత్రాలు హిట్ అయ్యాయని, ఈ సినిమా తమకు హ్యాట్రిక్‌గా నిలుస్తుందని దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, దీని తరువాత పాటల చిత్రీకరణ జరుపుతామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. కృతిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:సాయికార్తీక్, కెమెరా:దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ:బోగవల్లి బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వర్‌రెడ్డి.