బెంగాల్ టైగర్ పాటలు హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బీమ్స్ అందించిన సంగీతం మంచి హిట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 30న ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమాన్ని జరపనున్నామని అన్నారు. దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ.. మా బెంగాల్ టైగర్‌కు మంచి క్రేజ్ రావడం ఆనందంగా వుంది. ఇటీవలే విడుదలైన పాటలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. సంగీత దర్శకుడు బీమ్స్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని పాటలు మంచి హిట్టవ్వడం ఆనందంగా వుంది, రేడియోలో ఐ ట్యూన్స్‌లో ఈ పాటలు బాగా వినిపిస్తున్నాయని, పాటలను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ సందర్భంగా ఓ పోటీ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ‘ఈ చిత్రంలోని ఐదు పాటల్లోని పల్లవుల్ని పాడి మేము నిర్వహిస్తున్న బెంగాల్ టైగర్ సింగింగ్ కాంపిటీషన్‌కు పంపించండి. ఈనెల 21నుండి 28 వరకు ఈ పోటీ ఉంటుంది. మీ పాటలను సౌండ్‌క్లౌడ్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌కు పంపించండి. ఎంపికైన ముగ్గురు విజేతలకు ప్లాటినమ్ డిస్క్ రోజున బహుమతులు అందించడంతోపాటు మొదటి విజేతకు నేను సంగీతం అందించే చిత్రంలో పాట పాడే అవకాశం కల్పిస్తాం’ అన్నారు.