త్వరలో చల్ చల్ గుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందించిన చిత్రం ‘చల్ చల్ గుర్రం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ, కథపై నమ్మకంతో నిర్మాత ఈ చిత్రాన్ని ఎమోషనల్ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారని, శైలేష్ నటించిన రెండవ చిత్రమైనా చక్కగా నటించాడని తెలిపారు. దాదాపు 34 పాత్రలతో ఒక పాత్రకు ఒక పాత్రకు ఎక్కడా సంబంధం లేకుండా ఉండడం ఈ చిత్రంలో వైవిధ్యంగా వుంటుందని, యూనిక్ కానె్సప్ట్‌తో మనుషుల మధ్య వస్తు సంబంధం కాక, సంస్కార సంబంధం వుండాలన్న కోణంలో కార్పొరేట్ బ్యాగ్రౌండ్‌లో సినిమాను తీర్చిదిద్దామని ఆయన అన్నారు. కుటుంబ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పాత్రలన్నీ మన చుట్టూ కనిపించేవిలా ఉంటాయని, ప్రతి డైలాగులో కామెడీతోపాటు కొన్ని నగ్న సత్యాలు ఉంటాయని ఆయన తెలిపారు. కథలో నవ్యత అందరికీ నచ్చుతుందని, వెంగి సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయని, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని హీరో శైలేష్ తెలిపారు. నాగబాబు, బెనర్జీ, అశోక్‌కుమార్, చిట్టిబాబు, ముక్తార్‌ఖాన్, ప్రవీణ్, సుడిగాలి సుధీర్, అంబటి శ్రీను, హర్ష, తిరుపతిప్రకాష్, దువ్వాసి, జూ.రేలంగి, శిల్ప తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వి.శ్యామ్‌ప్రసాద్, సంగీతం: వెంగి, ఎడిటింగ్: శంకర్, నిర్మాత: ఎం.రాఘవయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనప్రసాద్.