అమెరికాలో కబాలి జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి చిత్రం ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా మొదటినుంచి భారీ అంచనాల్ని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైలర్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. కబాలి రా అంటూ రజనీ పలికిన డైలాగ్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రజనీకి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో మంచి ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. తాజాగా భిన్నమైన ప్రమోషన్‌తో కబాలికి భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో 400 స్క్రీన్‌లలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఈ సినిమా టిక్కెట్లకోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే టికెట్లన్నీ అయిపోవడం విశేషం. నిజంగా ఇది సంచలనమని చెప్పాలి. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇండియాలో బాహుబలి రికార్డుల్ని బద్దలుకొడుతుందని అంటున్నారు.