త్వరలో సర్వాయి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైహింద్ పిక్చర్స్ పతాకంపై జైహింద్ గౌడ్ హీరోగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి తమ 90వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్’. ఈ చిత్రాన్ని పి.జైహింద్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- బడిపంతులు, పాడిపంటలు, ఇల్లు ఇల్లాలు, కొత్తకాపురం వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సర్వార్ సర్వాయి పాపన్నగౌడ్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుందని అన్నారు. ఒకప్పుడు నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించి గోల్కొండను జయించిన వ్యక్తి, నేటి రాజకీయాలను సమాజంలోని కుళ్లు కుతంత్రాలను ఎత్తిచూపుతూ, ప్రజలను చైతన్యవంతులను చేసే అంశాలతో ఈ చిత్రం ఉంటుందని అన్నారు. దర్శకుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, జైహింద్ గౌడ్ లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో చదివిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీద్దామని చెప్పాడని, కథ బాగా నచ్చడంతో నేను దర్శకత్వం వహిస్తున్నానని, ఇది తన 90వ చిత్రమని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తిచేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రానికి కథ:శమంత, పాటలు:దామెర విష్ణుమోహన్‌రావు, కెమెరా:కంకణాల శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత:జైహింద్ గౌడ్, దర్శకత్వం:పి.చంద్రశేఖర్‌రెడ్డి.