ఆమె.. అతడైతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఆమె అతడైతే’. షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంనుండి తన లక్ష్యంకోసం పట్టణానికి వచ్చిన ఓ యువకుని కథాకథనంతో సాగే ఈ చిత్రంలో అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనే పాయింట్‌తో ఈ చిత్రం సాగుతుందని, పూర్తిస్థాయి లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని తెలిపారు. డిఫరెంట్ టైటిల్ పెట్టడానికి గల కారణం కథ అలా ఉండడంతో పెట్టామని, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుందని, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతామని తెలిపారు.