7 టు 4 టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్ ముఖ్యపాత్రల్లో మిల్క్ మూవీస్, మినర్వా టాకీస్ పతాకాలపై విజయశేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘7 టు 4’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.ఎల్.సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నిర్మాత వల్లూరుపల్లి రమేశ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వల్లూరుపల్లి రమేష్ మాట్లాడుతూ, మంచి సామాజిక అంశంతో ఈ సినిమా తెరకెక్కించారని, తెలుగులో మహిళా సంగీత దర్శకులు తక్కువని, స్నేహలత సంగీతం అందిస్తున్న చిత్రమిదని అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ టీజర్ చూస్తుంటే చిరంజీవిగారి ‘్ఠగూర్’ సినిమా గుర్తుకు వస్తోందని, విజయ్‌కు దర్శకుడిగా మంచి భవిష్యత్ వుంటుందని అన్నారు. దర్శక నిర్మాత విజయ్ మాట్లాడుతూ, రొటీన్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కించిన చిత్రమిది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించామని, అందరికీ నచ్చే అన్ని అంశాలతో తెరకెక్కిన చిత్రమిదని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:స్నేహలత, కెమెరా:ప్రభాత్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, సహ నిర్మాతలు:ఇ.బాలనాయక్, కె.రమేష్, నిర్మాత, దర్శకత్వం:విజయ్ శేఖర్ సంక్రాంతి.