స్పెషల్ సాంగ్‌లో తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దర్శకుడు.. ఒక హీరోయిన్‌తో తాను చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటున్నాడు అంటే వారిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉన్నట్లు లెక్క. ఈ లెక్క అప్పట్లో రమ్యకృష్ణ రాఘవేంద్రరావుతో ఎక్కువ సినిమాలు చేసి, షాక్ ఇచ్చారు. ఇప్పుడు అదే దారిని మరో దర్శకుడు వెడుతున్నాడు. ఏమైందీవేళ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సంపత్‌నందికి రామ్‌చరణ్‌తో చేసిన రచ్చ భారీ కమర్షియల్ విజయాన్ని అందించింది. దాంతో ఆయన ఇటీవల రవితేజతో బెంగాల్‌టైగల్ అంటూ వచ్చి మరో హిట్ అందుకున్నాడు. అయితే ఈ రెండు చిత్రాల్లో నటించింది మిల్క్భీమ తమన్నా. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో దర్శకుడికి లక్కీ హ్యాండ్ అవడంతో తమన్నాను ఆయన వదిలేలా లేడు. అందుకే తన తర్వాతి సినిమాలో కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాడు. తాజాగా సంపత్‌నంది గోపీచంద్‌తో మరో సినిమాను కూడా రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కూడా తమన్నానే హీరోయిన్‌గా అనుకుంటే డేట్స్ లేని కారణంగా హన్సిక, కేథరిన్‌లను ఎంపిక చేశారు. అయినా ఈ సినిమాలో ఎలాగైనా తమన్నాతో ఓ స్పెషల్ పాటలో నటింపచేయాలని దర్శకుడు భావిస్తున్నాడట! తమన్నాతో కచ్చితంగా చేయించాలని అనుకోవడంతో తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోడానికి సిద్ధమయ్యాడట. తన లక్కీ హ్యాండ్ మీద ఎంత నమ్మకమో కదా! ఈ పాటలో నర్తించడానికి తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట!