సెప్టెంబర్‌లో కాకతీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరత్న, శిల్ప, యామినీ హీరో హీరోయిన్లుగా వి.సముద్ర దర్శకత్వంలో ఎల్.వి.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకతీయుడు’. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే చిత్రమిదని అన్నారు. విద్య, వైద్య వ్యవస్థలను ప్రైవేటీకరణ చేయడంవల్ల మధ్యతరగతి వర్గాలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, స్వార్థ ప్రయోజనాలతో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నాయకులవల్ల ఎలాంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తారకరత్న పాత్ర భిన్న కోణాల్లో వుంటుందని, ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారని, మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తారకరత్నకు మంచి బ్రేక్‌నిస్తుందని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, చక్కని పాయింట్‌ను తీసుకొని సముద్ర అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, పూర్తిస్థాయి కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని అన్నారు. శోభారాణి మాట్లాడుతూ, టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా వుంది.
సమాజానికి ఉపయోగపడే మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, తారకరత్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఆర్.శంకర్, కెమెరా:పి.సహదేవ్, సహ నిర్మాతలు:గుర్రం మహేష్ చౌదరి, గోడూర్ గోపాల్‌శెట్టి, పొందూరు కాంతారావు, నిర్మాత:లగడపాటి శ్రీనివాస్, దర్శకత్వం:సముద్ర.