అనుకున్న సమయానికే పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం, సూర్య తప్పుకోవడంతో ఆగిపోయింది. ఆ తరువాత ‘గోపాల గోపాల’ ఫేం డాలీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ సినిమా ఊపందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. డిసెంబర్ వరకూ చిత్రాన్ని పూర్తిచేసి ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్‌తోపాటు మిగతా వివరాలను అధికారికంగా త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ సినిమా తరువాత పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారని తెలిసింది.