ఆ ఇద్దరూ కాదన్నారు! సునీల్ ఔనన్నారు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రం ఇదని అంటున్నాడు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. ‘రక్ష’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన, తాజాగా సునీల్, మన్నారాచోప్రా జంటగా నటించిన ‘జక్కన్న’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన విశేషాలు..
మంచి స్పందన
సినిమా విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా ఆ తరువాత రోజునుంచీ కలెక్షన్లు భారీగా పుంజుకున్నాయి. ఎక్కడ చూసినా హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు జక్కన్నను బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము ఊహించినదానికన్నా రెస్పాన్స్ ఎక్కువ వుంది.
సునీల్ కెరీర్‌లో బెస్ట్
సునీల్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. నిజంగా ఆయన ఇచ్చిన సపోర్టుతోనే ఈ సినిమా చేయగలిగాను. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో జక్కన్న భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకున్న చిత్రమని చెప్పాలి. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. మర్యాద రామన్న, పూలరంగడు సినిమాల తరువాత భారీ ఓపెనింగ్స్ దక్కిన సినిమా ఇది.
ముందు వేరేవాళ్లకి చెప్పా
నిజానికి ఈ కథ రాసుకున్న తరువాత వేరే ఇద్దరి హీరోలతో చర్చించా. కానీ దీనికి సునీల్ అయితేనే కరెక్ట్ అని ఆయనతో చెప్పా. కథ బాగుంది, చేద్దామని చెప్పడంతో డెవలప్ చేశా. ఈ సినిమాతో నా కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చింది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులు అనుకున్నాను. చర్చల దశలోనే ఉన్నాయి. మళ్లీ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమానే చేస్తా.