వైజాగ్‌లో హైపర్ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, రాశీఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ, హైపర్ టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, టైటిల్‌కు తగ్గట్టుగానే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ఇదని అన్నారు. ఈ నెల 5 నుంచి వైజాగ్‌లో మరో షెడ్యూల్ జరుగుతుందని, ఈనెల 20 వరకూ జరిగే షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుందని, సెప్టెంబర్ 9 వరకు పాటలను కూడా చిత్రీకరించి సెప్టెంబర్ రెండవ వారంలో ఆడియోను విడుదల చేస్తామని అన్నారు. విజయదశమి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ, టైటిల్‌కి రామ్ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాడని, అతని పాత్ర కూడా ఎనర్జీకి తగ్గట్టుగానే వుంటుందని, యాక్షన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కలగలసిన ఈ సినిమా అందరికీ నచ్చేలా తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కెమెరా:సమీర్‌రెడ్డి, ఎడిటింగ్:గౌతంరాజు, మాటలు:అబ్బూరి రవి, సమర్పణ:వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు:రామ్, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, దర్శకత్వం:సంతోష్ శ్రీనివాస్.