12న బొమ్మల రామారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా నిశాంత్ దర్శకత్వంలో మీడియా వాల్ స్టోరీ టెల్లర్స్ పతాకంపై పూదారి అరుణ నిర్మించిన చిత్రం ‘బొమ్మల రామారం’. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత పూదారి అరుణ వివరాలు తెలియజేస్తూ, ఇటీవల విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా అనుకున్న విధంగా తెరకెక్కించాం. ఉన్నవాడికీ లేనివాడికీమధ్య ఓ అంతరం, పోరాటం ఎప్పుడూ ఏదో రూపంలో ఉంటుంది. దాన్ని ఒక గ్రామం నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేశాం. దర్శకుడు నిశాంత్ ఆద్యంతం ఆసక్తిగా తెరకెక్కించాడు. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతోపాటు అన్ని రకాల కమర్షియల్ అంశాలున్న ఈ సినిమా మంచి మెసేజ్‌ను కూడా అందిస్తుంది. ఈ సినిమాతో 50 మంది నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తున్నాం. ముఖ్యంగా సుశీలగారు పాడిన పాట హైలెట్ అవుతుంది అన్నారు.