హాలీవుడ్ ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో హీరోగా ప్రవేశించి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అరవింద్‌స్వామి. ఆ తరువాత బొంబాయి సినిమాతో బాలీవుడ్‌లోనూ పాపులరైన అరవింద్‌స్వామి ఆ తరువాత వరుస సినిమాల పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత కడలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయనకు తనిఒరువన్ మంచి బ్రేక్‌నిచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ విలన్‌గా ప్రారంభించిన అరవింద్‌స్వామికి ఆ సినిమాతో అటు బాలీవుడ్‌నుండి ఇటు టలీవుడ్ వరకూ అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తనిఒరువన్ రీమేక్ ధ్రువ చిత్రంలో అదే పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈయనకు హాలీవుడ్‌నుండి అవకాశం దక్కింది. మాడ్‌మాక్స్ ఫ్యూరి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కే చిత్రం కోసం అరవింద్‌స్వామిని అడిగారట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.