మరో చిన్న సినిమాతో సుకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడిగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్, ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా చిన్న సినిమాలని నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం సంచలన విజయం సాధించింది. దాంతో మరింత ఊపుతో ఆయన మరిన్ని చిత్రాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ నిర్మించే ఈ బ్యానర్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. నాగశౌర్య హీరోగా నటిస్తాడని, ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.