శేఖర్ కమ్ముల ఫిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై దర్శకుడిగా తనదైన గుర్తింపు దక్కించుకున్న శేఖర్ కమ్ముల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘్ఫదా’. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో వరుణ్ తేజ్ హీరోగా మలయాళ ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, చక్కని ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిదని, ఆనంద్, గోదావరి తరువాత పూర్తి స్థాయి ప్రేమకథతో సినిమా చేయలేదని, ఈ సినిమాకు మంచి కథ కుదిరిందని, వరుణ్, సాయిపల్లవిల జంట చాలా ఆకట్టుకునేలా వుందని. దిల్‌రాజు బ్యానర్‌లో తొలిసారి పనిచేయడం ఎగ్జైటింగ్‌గా వుందన్నారు. నటుడు నాగబాబు మాట్లాడుతూ, సినిమా అంటే పాషన్ వున్న దిల్‌రాజుతో సినిమా అంటే ఏ హీరో అయినా ముందుకు వస్తాడని, ఫీల్ గుడ్ విలువలున్న సినిమా తీయడంలో శేఖర్ కమ్ముల స్పెషలిస్టని, వీరిద్దరి కాంబినేషన్‌లో వరుణ్ సినిమా చేయడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, ఏడాదిక్రితం శేఖర్ చెప్పిన కథ వినగానే ఎగ్జైట్ అయ్యానని, ఈ కథకు వరుణ్‌తేజ్ అయితే బాగుంటుందని తనతో చేస్తున్నామని అన్నారు. ‘కంచె’లో తన నటనతో వరుణ్ ఆకట్టుకున్నాడని అన్నారు. అమెరికా అబ్బాయికి, తెలంగాణలో పెరిగిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఖచ్చితంగా ఓ సెనే్సషనల్ లవ్‌స్టోరి అవుతుంది. దిల్, ఆర్య, కొత్తబంగారులోకం చిత్రాల తరువాత కొత్త జోనర్‌లో సినిమాలు తీశానని, ఈరోజు ప్రారంభమైన ఈ చిత్రం 40 రోజులపాటు ఇక్కడే షూటింగ్ జరుపుకుంటుందని, తరువాత షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరిస్తామని అన్నారు. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ, ఇది తన తొలి తెలుగు సినిమా అని, మంచి టీమ్‌తో పనిచేయడం ఆనందంగా వుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:విజయ్‌కుమార్, సంగీతం:శక్తీకాంత్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:దిల్‌రాజు, దర్శకత్వం:శేఖర్ కమ్ముల.