హీరోయిన్‌గా గౌతమి కూతురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో వారసురాలుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి త్వరలోనే కథానాయికగా పరిచయవౌతోంది. ఫిల్మ్ యాక్టింగ్‌లో కోర్సుచేస్తున్న ఆమె తెలుగులోగానీ, లేదంటే తమిళంలోగానీ ఎక్కడ మంచి అవకాశమొస్తే అక్కడ్నుంచి ఇంట్రడ్యూస్ అవ్వాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. గౌతమి కూడా ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ఒప్పేసుకుంది.
ఇటీవల ‘మనమంతా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన గౌతమి తన కూతురుని కూడా హీరోయిన్‌గా చూసుకోవాలని ఆశపడుతోంది. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘సుబ్బలక్ష్మికి సినిమాలంటే ఇష్టమే. నటిస్తానంటోంది. ఇటీవల ఫిల్మ్ మేకింగ్‌కీ, యాక్టింగ్‌కీ సంబంధించిన కోర్సులో చేరింద’ని చెప్పుకొచ్చింది. అన్నట్టు గౌతమి తన పేరు మోడరన్‌గా ఉంటే తన కూతురుకి మాత్రం సుబ్బలక్ష్మి అని ఎందుకు పెట్టిందో తెలుసా? గౌతమి అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి అట. ఎంతో ఇష్టమైన తన తల్లి పేరునే తన కూతురికి పెట్టిందన్నమాట. గౌతమి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేస్తుందట.