నారదుడి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్, జెనీలియా, శ్రీయ ప్రధాన తారాగణంగా సూరజ్ ప్రొడక్షన్స్-2, టూ అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జవహర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాన్ని తెలుగులో ఉమ, వై.వి.సత్యనారాయణ అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకుని, విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. తెలంగాణ మంత్రివర్యులు టి.పద్మారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆడియోను, థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, బిచ్చగాడు చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని, ట్రైలర్, పాటలు ఎంత బాగున్నాయో అలాగే సినిమా కూడా అంతే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. త్వరలో తమ సంస్థనుండి పిజ్జా-3 అనే మరో డబ్బింగ్ చిత్రం రానుందని, అతి త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. తమిళంలో కన్నా తెలుగులో మరింత విజయం సాధించాలని మంత్రి పద్మారావు, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, రాజ్ కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్ పేర్కొన్నారు.