నేను..శైలజ విభిన్నంగా ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, కీర్తి సురేష్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ‘నేను.. శైజల’ పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు కరుణాకరన్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. రామ్ మాట్లాడుతూ, ‘పెదనాన్న త్రివిక్రమ్ సినిమా చేస్తున్న సమయంలో ఇంటికొచ్చినపుడు కొన్ని డైలాగులు చెప్పేవారు. అవి విన్నపుడు చాలా ఎగ్జైట్ అయ్యేవాణ్ణి. ఆ తరువాత కిశోర్ కథ చెప్పినపుడు అలాంటి ఎగ్జైట్‌మెంట్ కలిగింది. ఈమధ్య రొటీన్ సినిమాలు చేస్తున్నాననే మాటలు విన్పిస్తున్నాయి. అందుకే, విభిన్నంగా వుంటుందని ఈ సినిమా చేశాను. దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతం అందించారు అని అన్నారు. దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ, తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశానని అనుకుంటున్నానన్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ, కథ చెప్పగానే సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యానని, రామ్ ఎనర్జి చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.