అలా అయితే పెళ్లెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించింది. జాతీయ అవార్డు కూడా అందుకున్న ఈమెకు కమర్షియల్‌గా ఏ సినిమా విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం కన్నడంలో ఓ సినిమా చేస్తున్న ఈమె తాజాగా సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఆ వివరాల్లోకెళితే ఇటీవలే దర్శకుడు విజయ్, హీరోయిన్ అమలాపాల్‌లు విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. విడాకులకోసం కోర్టు గుమ్మం కూడా ఎక్కారు. ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ సినిమాల్లో నటించాలనుకునే హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. అంతేకాదు పెళ్లిచేసుకున్న తర్వాత వాళ్లను వంటగదికే పరిమితం చేయడం తగదని, ఈ విషయంలో విజయ్ కుటుంబం చేస్తున్న ప్రయత్నం తప్పని చెబుతోంది. మొత్తానికి హీరోయిన్లుగా వెలగాలనుకునేవారు పెళ్లిచేసుకోకూడదని చెబుతోంది.