శ్రీశాంత్‌కు జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాన యాదిరెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. శ్రీశాంత్ సరసన హీరోయిన్‌గా ‘లవ్‌లీ’ ఫేమ్ శాన్వి నటిస్తోందట. ‘లవ్‌లీ’తో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత అక్కినేని హీరో సుశాంత్ సరసన అడ్డా, వర్మ దర్శకత్వంలో వచ్చిన రౌడీ చిత్రాల్లో నటించి గ్లామర్‌తో ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత సాన యాదిరెడ్డి చేస్తున్న ఈ సినిమాతో తన కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకంతో వుంది అందాల భామ శాన్వి.