డబ్బింగ్‌లో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు గోపీచంద్, రాశిఖన్నా జంటగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఆక్సిజన్ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత ఐశ్వర్య తెలియజేస్తూ.. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయింది. దాంతోపాటు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఇప్పటికే సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. రాశిఖన్నా, అనూఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చేనెలలో పాటల్ని విడుదల చేసి, అదే నెల చివరలో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: వెట్రి, ఫైట్స్: పీటర్ హెయిన్, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జ్యోతికృష్ణ.