మూడు సినిమాలతో నిహారిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారికకు ఒక మనసు చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిహారిక మొదట్లో బాగా ఫీలైనా ప్రస్తుతం తదుపరి చిత్రాలతో స్పీడ్ పెంచేందుకు సిద్ధమైంది. తాజాగా ఈమె బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన హ్యాపీ ఎండింగ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నూతన దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. హీరోగా ఇటీవలే పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటిస్తాడట. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించే చిత్రానికి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. ఎన్నో సంచలన విజయాల్ని అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దీంతోపాటు మరో క్రేజీ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఒక మనసు తర్వాత మెగా అమ్మాయి స్పీడ్ బాగా పెంచింది.