వెక్కిరింత పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకర్ల నాని (శ్రీ్ధర్), వినీత్, ప్రేయసి నాయక్, వౌనికరెడ్డి ముఖ్య పాత్రల్లో కాకర్ల రాహుల్, శే్వతా సమర్పణలో లాస్య క్రియేషన్స్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మిస్తున్న ‘వెక్కిరింత’ సినిమా పాటలు హైదరాబాద్ సారథి స్టూడియోలో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిర్మాత సాయి వెంకట్ సీడీని విడుదల చేయగా, ఘంటాడి కృష్ణ, మహిత్ నారాయణ్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా టైటిల్ భిన్నంగా ఉంది. ఈ ఏడాది చిన్న సినిమాలే మంచి ఆదరణ పొందుతున్నాయి.’ అన్నారు. దర్శకుడు జంగాల నాగబాబు మాట్లాడుతూ, అనుకున్న సమయంలోనే చిత్రాన్ని పూర్తిచేసాం, మంచి మ్యూజిక్ కుదిరింది, కొత్తవారు హీరోహీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నా బాగా నటించారని అన్నారు.