సుడిగాలి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్‌గౌడ్, మల్లేశ్‌యాదవ్, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ముఖ్యపాత్రల్లో రమేష్ అంకం దర్శకత్వంలో శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై సి.వెంకటేష్‌గౌడ్, బి.మ ల్లేశ్ యాదవ్ నిర్మిస్తున్న ‘సుడిగాలి’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్‌నిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ, దర్శకుడు రమేష్ నాకు కథ చెప్పాడని, దానికితగ్గట్టుగా మంచి టైటిల్ కుదిరిందని, తనకిది నాలుగో సినిమా అని, తప్పకుండా మంచి విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రవీంద్రగుప్తా మాట్లాడుతూ, చిన్న సినిమాలు తీయడం చాలా ఈజీ కానీ, విడుదల చేయడం చాలా కష్టమని, మంచి పబ్లిసిటీ చేసి ప్రమోషన్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. దర్శకుడు రమేష్ మాట్లాడుతూ, ‘సుడిగాలి’ అనే పదం చాలాసార్లు వింటుంటామని, దాన్ని బేస్ చేసుకొని చేసిన సినిమా ఇదని, అసలు సుడిగాలి అంటే చాలామంది దెయ్యమంటారని, ఆ దెయ్యాన్ని ఈ సుడిగాలిలో ఎలా చూపిస్తున్నామనేదే సినిమా అన్ని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, చిన్నప్పటినుంచీ హీరో అవ్వాలనే కోరిక ఈ సినిమాతో తీరుతోందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రాప్ రాక్ షకీల్, ఎడిటింగ్:మేనగ శ్రీను, నిర్మాతలు:సి.వెంకటేష్ గౌడ్, బి.మల్లేశ్ యాదవ్, దర్శకత్వం:రమేష్ అంకం.