బాహుబలి-2 ఫస్ట్‌లుక్ అప్పుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిన ‘బాహుబలి’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజవౌళి దర్శకత్వంలో ‘ది కంక్లూజన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాను అంతే భారీగా రూపొందిస్తున్నారు. పాటల చిత్రీకరణ వచ్చే నెల నుంచి జరుపుతారని, దాంతోపాటు ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాహుబలి-2 సినిమా కోసం అందరిలో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బాహుబలి-2 ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట. రానా, అనుష్క ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.