ఉత్కంఠ రేపే టైమ్‌మిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చైతు, అఖిల్ గెస్ట్‌రోల్ చేస్తామని చెప్పినపుడు ఎగ్జైట్ అయ్యా’ అని అంటున్నాడు హీరో సుశాంత్. సుశాంత్, సోనమ్ బజ్వా జంటగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతున్న సందర్భంగా హీరో సుశాంత్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ
‘‘అడ్డా’ సినిమా తరువాత కొంత గ్యాప్ వచ్చింది. మంచి సినిమాతో వద్దామని వెయిట్ చేస్తున్నాను. ఆ సమయంలో శ్రీ్ధర్ శీపాన ఈ కథ చెప్పాడు. చెబుతున్నంతసేపూ విపరీతంగా నవ్వాను. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకె అయ్యింది. తప్పకుండా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. బ్రహ్మానందం, పృధ్వీ, పోసాని వంటి సీనియర్ నటులతో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా టైమ్‌మిషన్ ఎపిసోడ్ హైలెట్‌గా నిలుస్తుంది.
పల్లెకుపోదాం రీమిక్స్
ఈ చిత్రానికి టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. ఇప్పటికే అనూప్ ఇచ్చిన మ్యూజిక్ మంచి విజయాన్ని సాధించి సినిమాపై అంచనాలను పెంచింది. దాంతోపాటు కెమెరా, ఎడిటింగ్ విషయాల్లో కూడా హైలెట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా నిర్మాత శ్రీనివాస్, అమ్మ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నేను చేసిన సినిమాల్లోకి భారీ బడ్జెట్ సినిమా ఇది. అలాగే నాగేశ్వర్‌రెడ్డి మేకింగ్ అదిరిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. అలాగే తాతగారి దేవదాసులోని ‘పల్లెకు పోదాం’ పాటను రీమిక్స్ చేశాం. అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
వారి ఎంట్రీ ప్రత్యేకం
ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో నాగచైతన్య నటించాడు. కథ అనుకున్నపుడే ఈ పాత్రకు తనైతే బాగుంటుందని చెప్పాను. తను కూడా కథ విని చేస్తానని చెప్పడంతో ఎగ్జైట్ అయ్యా. అలాగే అఖిల్ ఓ పాటలో నాతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. డ్యాన్స్‌లో తను అదరగొట్టాడు. ఒకరకంగా అక్కినేని అభిమానులకు పండగలాంటిదే అని చెప్పాలి.
తదుపరి చిత్రాలు
నా నెక్స్ట్‌మూవీ వేరే బ్యానర్‌లో వుంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అన్నారు.

-యు