కుటుంబ కథతో ఆటాడుకుందాం రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ హీరోగా నటించిన సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను శనివారం ఉదయం ఏర్పాటుచేశారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘కథ చెప్పినప్పుడు మా నిర్మాతలు ఏం నమ్మారో అది నిజమైంది. టైమ్‌మిషిన్ సంబంధించిన సన్నివేశాలన్నీ కొత్తగా అనిపించాయి. సుశాంత్ ఇప్పటివరకు యాక్షన్ ఇతరత్రా పాత్రలు చేశాడు. ఫస్ట్‌టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేశాడు. పాట బ్యాక్‌గ్రౌండ్‌లో అఖిల్ వచ్చినప్పుడు, అతిథిగా నాగచైతన్య వచ్చినప్పుడు ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్‌లాగా ఫీలయ్యారు. కంప్లీట్ కుటుంబం అంతా చూసే సినిమా ఇది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా కంటిన్యూ అవుతుంది’అని చెప్పారు.
సుశాంత్ మాట్లాడుతూ.. ‘నిన్న ప్రేక్షకులమధ్య సినిమా చూశాం. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు చాలా జోనర్లు చేశా. ఫస్ట్‌టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశా. ఇదో కొత్త అనుభూతి నాకు. దర్శకుడు నన్ను బాగా బోల్డ్‌చేశారు. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో కథలో మంచి స్పాన్ ఉన్న సినిమా ఇది అని అన్నారు.
నాగసుశీల మాట్లాడుతూ.. ‘ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జనాల్ని నవ్వించాలనేదే మా టార్గెట్. సినిమా చూసే ప్రతిఒక్కరూ థియేటర్‌నుంచి నవ్వుకుంటూ వస్తున్నారు. ప్రేక్షకాదరణ ఇంకా ఉంటుందని నమ్ముతున్నాం. అనూప్ పాటలు, కెమెరా సినిమాకు కలిసొచ్చాయి. మేం అడగ్గానే అఖిల, చైతూ నటించినందుకు కృతజ్ఞతలు. వారి సీన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి’ అని తెలిపారు. చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. మాకు ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందుకే మా టీమ్ అంతా కలిసి వైజాగ్, విజయవాడ, తిరుపతితోపాటు పలు పట్టణాల్లో తిరిగి ప్రేక్షకుల్ని కలిసి కృతజ్ఞతలు చెబుతాం. మా బ్యానర్‌నుంచి వచ్చిన పెద్ద సినిమా ఇది. సమపాళ్ళలో అన్నీ కుదిరాయి. సుశాంత్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వడ్డించిన విస్తరిలాంటి సినిమా ఇది’అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.