వెంకీతో మారుతి చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, మారుతి కాంబినేషన్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం వచ్చేనెల ప్రారంభం కానుంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ తమ రెండవ చిత్రంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. డిసెంబర్ 16న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. రెండు హిట్ చిత్రాలతో వెంకటేష్ వరుస విజయాలతో నయనతార, ‘్భలే భలే మగాడివోయ్’ చిత్ర విజయంతో టాప్‌రేంజ్‌లో ఉన్న మారుతి కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నామని, 16నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు. మిగతా నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల గురించి తర్వాత ప్రకటిస్తామని, రెగ్యులర్ షూటింగ్ పూర్తిచేసి వచ్చే వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కెమెరా: ఎస్.వివేక్ ఆనంద్, ఎడిటింగ్: ఉద్ధవ్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.