ధ్రువ కోసం మారిన చెర్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 5తో షూటింగ్ పూర్తిచేసుకుని అదే నెలలో మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి అక్టోబర్ 7 దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ధ్రువ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథతో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో దానికి తగ్గట్టే రామ్‌చరణ్ బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల 5తో టాకీ పూర్తవుతుంది. అదే నెలలో పాటలు చిత్రీకరించి ముందుగా అనుకున్నట్టుగానే దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ చిత్రానికి సంగీతం:హిప్ హాప్ ఆది, ఆర్ట్:నాగేంద్ర, ఎడిటింగ్:నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వి.వై.ప్రవీణ్‌కుమార్, నిర్మాతలు:అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి.