నాకు భలేమంచిరోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజ్ షోరూమ్‌లో పనిచేసే అబ్బాయిగా నేను నటించిన ‘్భలే మంచిరోజు’ విడుదలై మంచి టాక్ పొందడం ఆనందాన్నిస్తోందని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఓ విచిత్రమైన కథతో ఈ చిత్రం సాగుతుందని హీరో సుధీర్‌బాబు తెలిపారు. ఆయన హీరోగా నటించిన ‘్భలే మంచిరోజు’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గూర్చి పలు విశేషాలు తెలిపారు. ఒకబ్బాయి ఇంట్లోనుండి బయటికి వెళ్లిన తర్వాత ఎవరెవర్ని కలుస్తాడు, వారివలన అతని జీవితం ఎలా మారిపోయిందనే కథనంతో వైవిధ్యమైన లొకేషన్లతో ఈ చిత్రాన్ని రూపొందించారని అన్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం కొంచెం రిస్కే అయినా ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య పూర్తి న్యాయం చేశారని, మొదట అతను డైరెక్ట్ చేసినా కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌ను తాను చూశానని తెలిపారు. మనుషులు లేకుండా కుర్చీలు, బల్లలు, ఫ్యాన్లు ఉపయోగించి ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చేశాడని, అది చూసే ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చానన్నారు. నిర్మాతలు, స్నేహితులు అయినంత మాత్రాన రాజీపడాల్సిన అవసరం లేదని, కాకపోతే వారుండడంవల్ల మరింత జాగ్రత్తలు, రెస్పాన్స్‌బులిటీస్ తీసుకోవాల్సి వచ్చిందని, సెట్స్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ ఖర్చుపెట్టద్దు అని తాను ముందే చెప్పానని తెలిపారు. రెగ్యులర్‌గా వస్తున్న సినిమా ఫార్ములాకు ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశామని, ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్స్, రొమాన్స్ లాంటివి కాకుండా 90 శాతం సినిమాను లైట్ లేకుండా చేశామని, సినిమాలో సస్పెన్స్ ఉంటూనే కామెడీ ఉంటుందని, ఓ కమర్షియల్ సినిమాగా రూపొందించే ప్రయత్నం చేశామని ఆయన వివరించారు. బాలీవుడ్‌లో బాబి చిత్రంలో విలన్‌గా నటిస్తున్నానని, ఇప్పటివరకు కొత్త సినిమాలు ఏవీ సైన్ చేయలేదని ఆయన అన్నారు.