రష్యాలో ఒక్కడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ రష్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ కోటిన్నర రూపాయల వ్యయంతో భారీ ఛేజ్‌ని సినిమాకు హైలెట్‌గా రూపొందిస్తున్నామని, హీరో ఇంట్రడక్షన్ పాటను కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నామని తెలిపారు. విశాల్, తమన్నా కాంబినేషన్‌తో భారీ బడ్జెట్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చేనెల 3నుండి పాటల చిత్రీకరణ జరుపుకోనుందని, విశాల్ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. అక్టోబర్ 9న ఆడియో విడుదల చేసి, దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.