ప్రారంభమైన ఆమె కోరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ శ్రీనివాస్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై స్వాతినాయుడు ప్రధాన పాత్రలో వల్లభనేని సురేష్ చౌదరి దర్శకత్వంలో చిక్కాల సత్యనారాయణ, మత్తిరత్నాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆమెకోరిక’ (ఇక కేకే కేక). ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ చౌదరి మాట్లాడుతూ ప్రశాంతంగా సాగుతున్న ఓ కుటుంబంలోకి ఓ మోడలింగ్ అమ్మాయి ప్రవేశిస్తే జరిగే పలు సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని కుటుంబ ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రీకరిస్తున్నామని, ఇందులో పాటలు, మాటలు హైలెట్‌గా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని పూర్తిచేశామని, దర్శకుడు కథలో అనేక ట్విస్ట్‌లు చెప్పారని, తప్పక ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం అవుతుందని నిర్మాతలు తెలిపారు. రాజు, సిరిప్రియ, శ్రీశ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీని, చిన్నికృష్ణ, కెమెరా: ప్రసాద్, నిర్మాతలు: చిక్కాల సత్యనారాయణ, మత్తి రత్నాకర్, దర్శకత్వం: వల్లభనేని సురేష్ చౌదరి.