సెప్టెంబర్‌లో బన్నీ సినిమా షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల విజయంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా అతనితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆ అవకాశాన్నీ బన్నీ దర్శకుడు హరీష్‌శంకర్‌కు ఇచ్చాడు. మొదటి నుండి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న హరీష్ పవన్‌తో ‘గబ్బర్‌సింగ్’, ధరమ్‌తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ రెండవ వారంలో మొదలుపెట్టి 2017 మార్చికల్లా పూర్తిచేసి మార్చి 27న నాడు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలిసింది.