పగతో రగిలే ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ కథానాయకుడు అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై తొలి క్లాప్ అభిషేక్ నామ ఇవ్వగా మధుసూధనరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుధీర్‌వర్మ మాట్లాడుతూ, రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నిఖిల్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారని, రివెంజ్ కథనంలో ఓ అందమైన ప్రేమకథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. షూటింగ్ అంతా కాకినాడ నుండి విశాఖపట్నం వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతామని అన్నారు. నిర్మాత అభిషేక్ మాట్లాడుతూ, నిఖిల్, సుధీర్‌వర్మ కలయికలో వచ్చిన ‘స్వామిరారా’ చిత్రంలో క్రైమ్ కామెడీ సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుందని, అదో ట్రెండ్‌లా మారిందని తెలిపారు. ఈ చిత్రం కూడా సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందన్న నమ్మకం వుందని దర్శకుడు కథను చక్కగా రాసుకున్నారని ఆయన అన్నారు. వచ్చేనెల 19నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుతామని తెలిపారు.