నాగ్ స్టాంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇప్పటికీ మన్మధుడుగా తనదైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రొమాంటిక్ సినిమాల్లో చేస్తూనే మరోవైపు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతో కలిపి పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియో సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. మై స్టాంప్ పేరుతో విడుదలవుతున్న ఈ స్టాంప్ టాలీవుడ్‌లో మొదటిసారిగా నాగార్జునది కావడం విశేషం. ప్రస్తుతం నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ చిత్రంలో భక్తుడిగా నటిస్తున్నారు.