తమన్నా కోసం శ్రుతి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ శృతిహాసన్ దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. హీరోయిన్‌గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఆమెలో మరో కోణాన్ని బయటపెడుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. శృతిహాసన్ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా సుపరిచితమే. ఇప్పటివరకూ రెండు మూడు చిత్రాలకోసం పాటలు పాడిన ఈమె ఇప్పుడు మరో హీరోయిన్‌కోసం తన గాత్రాన్ని అరువు ఇయ్యనుంది. విశాల్ హీరోగా తమిళంలో రూపొందుతున్న చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమాకోసం ప్రత్యేక పాటను శృతిహాసన్‌తో పాడించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సినిమాలో ఈ పాటను తమన్నా పాడుతుందట. శృతి వాయిస్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు శృతితో చర్చలు జరిపారు. ఈ పాట పాడడానికి ఆమె కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే సాంగ్ రికార్డ్ చేస్తారట. మొత్తానికి ఓ హీరోయిన్‌కోసం మరో హీరోయిన్ పాట పాడడం విశేషం.