2న సిద్ధార్థ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2న ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, మంచి టీంతో చేస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సిద్ధార్థ’ను రూపొందించామని, పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన డైలాగ్స్ రాశారని చెప్పారు. సెప్టెంబర్ 2న ఆడియో విడుదల చేస్తామని, సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సెప్టెంబర్‌లోనే మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఇతర తారాగణంగా నటించారు.