ఇంకొక్కడు వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాత్మక సినిమాల హీరో విక్రమ్ తాజాగా చిత్రం ‘ఇంకొక్కడు’ (తమిళ్‌లో ఇరుముగన్) పేరుతో మరో ప్రయోగాత్మక సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో డబ్ అవుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు యూ/ఏ సర్ట్ఫికెట్ జారీ చేసింది. ఇక తెలుగు వర్షన్ సెన్సార్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని, సెప్టెంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీఎత్తున సినిమా విడుదలకానుందని టీమ్ తెలిపింది. సైన్స్‌ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నారు. ముఖ్యంగా ‘లవ్’ అనే పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు.