అలరించే డిస్కో సుచిత్ర పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ, నాగబాబు, రవిబాబు ప్రధాన తారాగణంగా అమీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ రూపొందించిన చిత్రం ‘త్రివిక్రమన్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా ట్రైలర్‌ను కనుమూరి రఘురామకృష్ణరాజు విడుదల చేశారు. టైటిల్ లోగోను ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతుపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ, త్రివిక్రమ పాండ్యన్ అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఓ బృందం ఎదుర్కొన్న పరిస్థితిని, పరిణామాల సమాహారంగా ఈ చిత్రం రూపొందిందని, శ్రీ పాత్ర సరికొత్తగా ఈ చిత్రంలో డిజైన్ చేశామని తెలిపారు. ఓ మంచి సినిమా తీయాలనే తన కల మిత్రుల ప్రోత్సాహంతో సాకారమైందని, కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుందని తెలిపారు. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం లోగో, ట్రైలర్ బాగున్నాయని, ఘన విజయం సాధించాలని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. డిస్కోశాంతి సోదరి డిస్కో సుచిత్ర పాట హైలెట్‌గా ఉంటుందని తెలిపారు.