జాకీచాన్ సరసన తెలుగమ్మాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభిత ధూళిపాళ అచ్చ తెలుగమ్మాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయిలు తెలుగు సినిమాల్లో పనికిరారనే మాట ఎలాగూ ఉంది. అందుకే ఈమె బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. అనురాగ్ కశ్యప్ లాంటి పెద్ద దర్శకుడిని మెప్పించి.. ‘రమణ్‌రాఘవ్ 2.0’లో అవకాశం దక్కించుకున్న శోభిత.. ఆ సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ పక్కన ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కిందని చర్చించుకుంటోంది బాలీవుడ్. ఈమధ్య జాకీచాన్ ఇండియన్ హీరోయిన్ల మీద బాగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. మల్లికా శరావత్‌తో ‘ది మిత్’ సినిమా చేసిన జాకీ.. తాజాగా ‘కుంగ్ ఫూ యోగా’లో దిశాపటాని.. అమైరా దస్తూర్‌లతో జతకట్టాడు. దీని తర్వాత జాకీ చేయబోయే కొత్త సినిమాకు కూడా ఇండియన్ హీరోయిన్‌నే కోరుకున్నాడట. ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్లు శోభితతోపాటు తిలోత్తమ అనే మరో అమ్మాయిని కూడా ఆడిషన్ చేయగా.. శోభితనే ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు సమాచారం. ఆమెకే ఈ సినిమాలో అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్‌తో నటిస్తే శోభిత కెరీరే మారిపోవడం ఖాయం.