బాలీవుడ్ నాడి పట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రెజీనా ఈమధ్య మళ్లీ జోరుపెంచింది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఇప్పటికే ‘జ్యో అచ్యుతానంద’ సినిమా కంప్లీట్ చేసింది. దాంతోపాటు తెలుగులో మరో సినిమాకు కూడా ఓకే చెప్పింది. ఇక తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన ‘అంకెన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘అంకెన్ 2’లో నటిస్తోంది. ‘సక్సెస్ 2’ కర్టన్ రైజర్ కార్యక్రమంలో రాంప్ వాక్ చేసి వార్డ్రోబ్‌లో సంచలనం క్రియేట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో రెజినా బాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ జరిగిందని తెలిసింది. ఆ ఫొటోషూట్‌లో రెజీనా అందాలు మతిపొగడతాయట. అంతేకాదు బాలీవుడ్‌లో హీరోయిన్స్ మధ్య గట్టిపోటీ ఉంటుంది కాబట్టి ఆ పోటీని తట్టుకునేలా రెడీ అయ్యిందట! బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్‌లో డిమాండ్ చేస్తుందని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.