బన్నీకి జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుఅర్జున్, కాజల్ అగర్వాల్ ఆర్య-2లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మళ్లీ ఈ రొమాంటిక్ పెయిర్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుందని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో ‘డీజే’-దువ్వాడ జగన్నాథమ్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని టీమ్ భావిస్తోంది. నిన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా సెట్స్‌కి వెళ్లిన బన్నీ, హరీష్ అక్కడ కాజల్‌తో మాట్లాడారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం కాజల్ చేతిలో మెగాస్టార్ సినిమా మినహా కొత్త సినిమా ఏదీలేదు. కాబట్టి కాల్షీట్లు సమస్య కూడా ఉండదు. కాబట్టి బన్నీకి నో చెప్పే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఈ న్యూస్‌పై అధికారికంగా వార్తలు రావడమే తరువాయి.