హైదరాబాద్‌లో తమన్నా పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్‌కుమార్ కధానాయకుడిగా చెన్నాంబికా ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రంకోసం ఇటీవల బల్గేరియాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు. ఈ సినిమా కోసం అందాల నాయిక తమన్నా ఓ స్పెషల్ పాటలో నటించడానికి సిద్ధమవుతోందని, ఈ పాట సినిమాకు హైలెట్‌గా వుండనుందని, ఈనెల 5 నుండి హైదరాబాద్‌లో ఈ పాట చిత్రీకరణ జరుపుతామని అన్నారు. సెప్టెంబర్ 18న ఆడియో వేడుకను జరపనున్నామని, దసరా కానుకగా అక్టోబర్ 6న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఈ సినిమాకు మహదేవ్ మంచి స్క్రీన్‌ప్లేతో ముందుకు వచ్చారని, పరమహంస కెమెరా పనితనం, తమన్ సంగీతం హైలెట్‌గా వుంటాయని కధానాయకుడు నిఖిల్‌కుమార్ తెలిపారు. జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యామీనన్, అవినాష్, ప్రశాంత్, రావు రమేష్, సుప్రీత్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, నిర్మాత:అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:ఎ.మహదేవ్.