ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజిత్, షామిలి ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటుగా పాటల చిత్రీకరణ త్వరలో జరుపుతామని, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను తెలియజేసే అంశాన్ని కూడా చర్చిస్తున్నామని, త్వరలోనే ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేయనున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. నిషా, విజయ్‌కుమార్, షఫి, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీవిశ్వనాధ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు:కేదార్‌నాధ్, సంగీతం:సాబువర్గీస్, నేపథ్య సంగీతం:వైధి, కెమెరా:ఎస్.మురళీమోహన్‌రెడ్డి, నిర్మాత:ప్రభాత్ వర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాము.